అందుకే బస్సుయాత్రను అడ్డుకున్నారు: సుచరిత

తెదేపా అధినేత చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. అనుమతి ఇచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో బస్సు యాత్రను కొనసాగించినందువల్లే...

Updated : 08 Jan 2020 22:37 IST

గుంటూరు: తెదేపా అధినేత చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. అనుమతి ఇచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో బస్సు యాత్రను కొనసాగించినందువల్లే పోలీసులు అడ్డుకున్నారని సుచరిత స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ఎప్పుడైనా అఖిలపక్షం ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. విశాఖ విమానాశ్రయంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై  హత్యాయత్నం జరిగినా వైకాపా సంయమనం పాటించిందన్నారు. సహజ మరణాలను సైతం రాజధాని కోసమే అని చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధానిని తరలిస్తున్నట్లు ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. కేవలం వికేంద్రీకరణ మాత్రమే జరుగుతున్నట్లు వివరించారు. రాజధాని పేరుతో గత ప్రభుత్వం దాదాపు రూ. 2.50 లక్షల కోట్ల అప్పులు చేసి కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే రాజధానికి ఖర్చు చేశారని సుచరిత ఆరోపించారు. అమరావతి నుంచి పని చేయాలని భావించే ఉద్యోగులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని.. కొన్ని కార్యాలయాలు ఇక్కడి నుంచే పని చేస్తాయని సుచరితన వివరించారు. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సమీక్ష జరుపుతోందని.. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని సుచరిత స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని