అరెస్టులతో ఉద్యమం ఆగదు: గల్లా

అరెస్టులతో అమరావతి ఉద్యమం ఆగదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ స్పష్టం చేశారు. మీడియాపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న 14 మంది రాజధాని రైతులు ఇవాళ విడుదలయ్యారు. వారికి గల్లా జయదేవ్‌ జైలు వద్ద స్వాగతం పలికారు. ఈ

Updated : 11 Jan 2020 16:00 IST

గుంటూరు: అరెస్టులతో అమరావతి ఉద్యమం ఆగదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ స్పష్టం చేశారు. మీడియాపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న 14 మంది రాజధాని రైతులు ఇవాళ విడుదలయ్యారు. వారికి గల్లా జయదేవ్‌ జైలు వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీసు ఉన్నతాధికారులు  మాటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప రాజ్యాంగాన్ని, చట్టాలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. తీవ్రవాదులతో వ్యవహరించినట్లు రైతులతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో మహిళలపై జరిగిన దాడిని కేంద్ర మహిళా కమిషన్‌కు వివరిస్తామని తెలిపారు. పోలీసుల అణచివేత చర్యలు తమను ఆపలేవని రాజధాని రైతులు స్పష్టం చేశారు. వైకాపాకి ఓటు వేసినందుకు ఇదా ఫలితం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని