జోలె పట్టిన చంద్రబాబు

‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని;  మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు’ అని నినాదాలు చేస్తూ తిరుపతిలో అమరావతి పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి చేపట్టిన ర్యాలీ ఎన్టీఆర్‌ కూడలి మీదుగా కొనసాగుతోంది.

Updated : 11 Jan 2020 22:00 IST

తిరుపతిలో భారీ ర్యాలీ

తిరుపతి: ‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని;  మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు’ అని నినాదాలు చేస్తూ తిరుపతిలో అమరావతి పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి చేపట్టిన ర్యాలీ ఎన్టీఆర్‌ కూడలి మీదుగా కొనసాగుతోంది. అమరావతి పరిరక్షణ ఉద్యమం కోసం చంద్రబాబు నిధులు కూడా సమీకరిస్తున్నారు.ఇందులో భాగంగా తిరుపతి నగరంలో జోలెపట్టి నిధులు సేకరిస్తున్నారు. భారీగా ర్యాలీలో పాల్గొన్న ప్రజలు జోలెలో విరాళాలు వేస్తూ అమరావతి రాజధాని రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు.  తొలుత నగరంలోని పూలే విగ్రహం వద్దకు చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

తొలుత ఫూలే విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రకాశం రోడ్డు, ఎన్టీఆర్‌ కూడలి.. గాంధీ రోడ్డు.. కృష్ణాపురం ఠానా, నాలుగు కాళ్ల మండపం మీదుగా అక్కడి నుంచి గాంధీ విగ్రహం, అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. రెండు రోజుల క్రితమే అనుమతి కోసం దరఖాస్తు చేసినా తిరుపతి అర్బన్‌ పోలీసులు కాలయాపన చేశారు. దీంతో ర్యాలీ ఉంటుందో లేదో అనే సందిగ్ధత నెలకొంది. చివరకు ఈ సాయంత్రం 4గంటల సమయంలో నాలుగు కాళ్ల మండపం వరకు ర్యాలీ నిర్వహించొద్దని షరతులు విధిస్తూ కృష్ణాపురం ఠానా వరకు ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే, ముందుగా ప్రకటించిన మేరకే ర్యాలీ కొనసాగిస్తామని ఐకాస నేతలు చెబుతున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని