సీఏఏకు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కీలక ప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు తాను మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్‌దీప్‌సింగ్‌ దుంగ్‌ ప్రకటించారు.

Updated : 12 Jan 2020 17:33 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కీలక ప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు తాను మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్‌దీప్‌సింగ్‌ దుంగ్‌ ప్రకటించారు. ‘పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్థాన్‌లో ఉండే మన సోదరులు ఇక్కడికి వస్తే వారికి హక్కులు కల్పించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. వారికి ఇక్కడ పౌరసత్వం కల్పిస్తే జరిగే ప్రమాదమేమీ లేదు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలను రెండు వేరని వాటిని కలిపి చూడొద్దన్నారు. సీఏఏ అమలు చేస్తే తప్పేం లేదు’ అని వెల్లడించారు. పార్టీ నియమాలకు విరుద్ధంగా హర్‌దీప్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో జమ్మూకశ్మీర్‌కు కేంద్రం స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసినపుడు కూడా ఆయన మద్దతు ఇచ్చారు. అయితే సీఏఏకు మద్దతుగా ప్రచారంలో భాగంగా అమిత్‌షా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ పర్యటించనున్న నేపథ్యంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్‌లో సీఏఏ అమలు చేయమని ఇప్పటికే సీఎం కమల్‌నాథ్‌ ప్రకటించడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు