కాకినాడకు పవన్‌.. పోలీసుల మోహరింపు!

 జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పర్యటించనున్నారు. దిల్లీ నుంచి విశాఖ చేరుకోనున్న ఆయన.. నేరుగా మధ్యాహ్నం 3గంటల సమయంలో రహదారి మార్గంలో కాకినాడకు వెళ్తారు. ఆదివారం వైకాపా కార్యకర్తలతో

Updated : 13 Sep 2023 15:25 IST

విశాఖలో జనసేనానికి ఘన స్వాగతం

కాకినాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పర్యటించనున్నారు. దిల్లీ నుంచి విశాఖ చేరుకున్న ఆయన.. నేరుగా మధ్యాహ్నం 3గంటల సమయంలో రహదారి మార్గంలో కాకినాడకు వెళ్తారు. ఆదివారం వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడిన జనసేన నాయకులు, కార్యకర్తలను ఆయన పరామర్శించనున్నారు.  అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. పవన్‌ పర్యటన దృష్ట్యా కాకినాడలో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే, కాకినాడలో 144 సెక్షన్‌, పోలీసు 30 యాక్టును అమలు చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు, విశాఖ విమానాశ్రయంలో పవన్‌కు ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ఆయన వాహనంలో కాకినాడకు బయల్దేరారు. నక్కపల్లి టోల్‌గేట్‌ వద్ద వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. 

ఆదివారం రోజున కాకినాడ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు అనుకూలంగా శనివారం వైకాపా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ద్వారంపూడి జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీన్ని నిరసించిన జనసైనికులు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. ఆయన నివాసాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో భానుగుడి సెంటర్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లు విసరగా.. జనసేన కార్యకర్తలు ప్రతిదాడికి దిగారు. వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడిన జనసైనికులను ఈ మధ్యాహ్నం పవన్‌ కల్యాణ్‌ పరామర్శించనున్నారు.

ఇదీ చదవండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని