Updated : 14 Jan 2020 14:27 IST

ఆ రైతులతోమాట్లాడే టైం కూడా జగన్‌కు లేదా?

రాజధాని రైతులకు వంగవీటి రాధా సంఘీభావం

అమరావతి: రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ తుళ్లూరులో రైతుల నిరసనలు హోరెత్తుతున్నాయి. రాజధాని రైతులకు తెదేపా నేత వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రైతులకు కులాలు అంటగట్టడం సరికాదు. రాజధాని రైతుల త్యాగం దేశానికే ఆదర్శం. పక్క రాష్ట్రం సీఎంతో మాట్లాడటానికి ముఖ్యమంత్రి జగన్‌కు సమయం ఉంది. రాజధాని రైతులతో మాట్లాడేందుకు సమయం లేదా? ఏ జిల్లాలో ప్రమాణస్వీకారం చేశారో ఆ జిల్లాకే సమస్యలు సృష్టించారు. రైతులకు మద్దతుగా ఉంటాం. రైతుల నాయకత్వంలో మేమంతా నడుస్తాం. మూడు రాజధానులు అన్నా.. 30రాజధానులు అన్నా.. మనకు తెలిసిన ఒకే నినాదం ఒక్కటే. ఒకటే రాష్ట్రం.. ఒకటే రాజధాని.. అదే అమరావతి అనే నినాదంతో కలిసికట్టుగా ముందుకెళ్దాం’’ అని పిలుపునిచ్చారు. 

అంతకముందు దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూడా రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. కాసేపు రైతులకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని