ఈ ఏడాది కష్టాల సంక్రాంతి: చంద్రబాబు
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మందడంలో రైతుల దీక్షకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి దీక్షా శిబిరానికి విచ్చేసి కూర్చొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ..
మందడం: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మందడంలో రైతుల చేపట్టిన దీక్షకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం తన కుటుంబంతో పాటు నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి దీక్షా శిబిరానికి విచ్చేసి చంద్రబాబు కూర్చొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘నేను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడంలేదు. ఎందుకంటే ఈ ఏడాది కష్టాల సంక్రాంతి. దాదాపు 20 - 25 ఏళ్ల నుంచి నా సతీమణి మనం ఎక్కడున్నా ఫర్వాలేదు గానీ.. సంక్రాంతి మూడు రోజులు మాత్రం నారావారిపల్లెకు వెళ్లాలి అని చెప్పేవారు. ఆ పట్టుదలతోనే ఇన్నేళ్లూ సంక్రాంతి మా ఊళ్లో చేసుకొనేవాళ్లం. ఈ సారి సంక్రాంతి చేసుకోవడంలేదు. రాజధాని ప్రాంతంలో మహిళలు, రైతులు, రైతు కూలీలతో సంక్రాంతి జరుపుకోవాలని, వారి పోరాటానికి సంఘీభావం తెలియజేద్దామని వారు నాతో ఇక్కడికి వచ్చారు. ఓ వైపు ఆవేదన, బాధ ఉన్నా మరోవైపు రైతులను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది’’
ఎవరూ అధైర్యపడి ప్రాణత్యాగాలు చేయొద్దు
‘‘అమరావతి 29 గ్రామాల సమస్య కాదు. రైతులు, రైతు కూలీలు త్యాగాలు చేశారు. భూములు ఇచ్చారు. దానిపై రాష్ట్రానికి సంపద సృష్టించేందుకు ముందుకెళ్లాం. ఇది ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య అని ప్రభుత్వం గుర్తించాలి. అంతేగానీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు. శివరామకృష్ణన్ కమిటీ 45 రోజులు పాటు తిరిగి రాజధాని ఎక్కడ ఉండాలో సూచనలు చేసింది. ఆయన రాష్ట్రమంతా తిరిగాక అనుకూల ప్రదేశం విజయవాడ - గుంటూరు అని చెప్పారు. విజయవాడలోనే రాజధాని ఉండాలని మొదటి ఆప్షన్ ఇచ్చారు. గట్టిగా పోరాడి అమరావతి సాధించుకుందాం. ఎవరూ అధైర్యపడి ప్రాణ త్యాగాలు చేయొద్దు. రైతుల త్యాగాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉన్నారు. చాలా మంది భూములు ఇచ్చి గుండెపోటుతో చనిపోయారు. అందరికీ న్యాయం జరగాలని ఆలోచించేది మానవత్వం. అయితే, అందరినీ బాధపెట్టి ఆనందపడాలని జగన్ చూస్తున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అంటున్నారు.. రైతులను ఇబ్బంది పెడతారా? అందరూ భూములిచ్చేటప్పుడు సహకరించారు. రాజధాని ఒకేసారి నిర్మిస్తాం. ప్రతి వ్యక్తీ తమ అభివృద్ధితో పాటు అందరి గురించి ఆలోచించాలి. నేనెప్పుడూ ఇలాంటి సీఎంని చూడలేదు’’ అని చంద్రబాబు అన్నారు.
ఎడ్ల పందేలకు వెళ్లిన సీఎం.. రైతుల్ని పరామర్శించలేరా?
‘‘అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు. ఐదు కోట్ల మంది ప్రజలకు న్యాయం జరగాలని కష్టపడ్డాను. రైతుల చేతికి పంట వస్తే కొనే నాథుడే లేడు. ఎడ్ల పందేలకు వెళ్లిన సీఎం.. రైతులను పరామర్శించేందుకు రాలేరా? ఓ వైపు రైతులు ఆందోళన చేస్తుంటే కోడి పందేలు, ఎడ్ల పందేలకు వెళ్తారా? మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించే తీరికి సీఎంకు లేదా? విదేశాల్లో ఉన్న ఏపీ వాసులు ఇక్కడికి వచ్చేలా అమరావతిని నిర్మించాలనుకున్నాం. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టులు నిర్మించాం. అభివృద్ధి కోసం పోరాటం చేస్తుంటే కుల ముద్ర వేస్తున్నారు’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి కాదా అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్‌పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్‌సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్‌పై ఒంటరిగానే నా పోరాటం
-
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్‌సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
బాలీవుడ్, హాలీవుడ్‌ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది. -
రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం నేడు
కాంగ్రెస్ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(పీఈసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్