Updated : 16 Jan 2020 14:52 IST

‘మూడు రాజధానులేంటని నవ్వుతున్నారు’

అమరావతిపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తాం
మందడంలో సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు


 

మందడం: అమరావతి రాజధాని రైతుల పోరాటం జాతీయ స్థాయికి వెళ్లిందనీ.. మూడు రాజధానులేంటని అక్కడంతా నవ్వుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన నిరసన దీక్షలు 30వ రోజూ కొనసాగుతున్నాయి. మందడంలో రైతుల మహాధర్నాకు గురువారం ఆయన సంఘీభావం తెలిపారు. రాజధాని రైతుల దీక్షలు, ఆందోళనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం తీరు.. నిరసన దీక్ష చేపడుతున్న మహిళలు, రైతులపై పోలీసుల వ్యవహరిస్తున్న తీరును నారాయణ తప్పుబట్టారు. రాజధాని ప్రాంతాల్లో రైతుల కంటే పోలీసులు ఎక్కువ మంది ఉంటున్నారనీ.. ఒక్కో మనిషికి ముగ్గురు పోలీసుల చొప్పున ఉంచుతున్నారని మండిపడ్డారు. వీధుల్లో ఇప్పుడు ఎక్కడా కొట్లాటలు జరగట్లేదనీ.. ఎందుకంటే కొట్లాడుకునేవాళ్లంతా అసెంబ్లీకి చేరారంటూ నారాయణ ఎద్దేవా చేశారు. 

ఎన్నికలకు వెళ్లండి.. గెలిచి వచ్చి అప్పుడు చేయండి 

శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడులేంటి? పోలీసులు దాడిచేయడానికి రైతుల వద్ద ఏమైనా బాంబులు, మారణాయుధాలు ఉన్నాయా? అని నారాయణ ప్రశ్నించారు. మూడు రాజధానులు చేస్తే తమకు అభ్యంతరం లేదన్న ఆయన.. రాజీనామా చేసి ఎన్నికలకు వైకాపా వెళ్లాలని డిమాండ్‌ చేశారు. మూడు రాజధానుల అంశం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి గెలిచి వచ్చి చేయాలని సవాల్‌ విసిరారు. ఇవన్నీ చేయకుండా మూడు ముక్కలు చేసే హక్కు సీఎం జగన్‌కు లేదన్నారు. విశాఖకు ఉద్యోగులను తరలించాలంటే రూ.2లక్షల కోట్లు అవసరమవుతుందన్నారు. అమరావతి నడిబొడ్డున 50వేల ఎకరాల భూమి ఉందన్నారు. 12వేల ఎకరాలను అభివృద్ధికి ఇస్తే పైసా ఖర్చు లేకుండా నిర్మించవచ్చన్నారు. పోలీసులు, గన్‌మెన్లు లేకుండా ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు తిరగగలరా? అని ప్రశ్నించారు. అమరావతి అంశంపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని నారాయణ ప్రకటించారు. 


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని