కలిసి నడవడంపైనే భాజపా-జనసేన చర్చ!

భాజపా, జనసేన కీలక భేటీ ముగిసింది. రాష్ట్రంలో మరోసారి కలిసి పొత్తు పెట్టుకొనేందుకు సిద్ధమైన భాజపా - జనసేన నేతలు 2024 వరకు కలిసి నడిచేందుకు అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

Updated : 16 Jan 2020 15:51 IST

పవన్‌తో ముగిసిన భాజపా నేతల కీలక భేటీ

విజయవాడ: భాజపా, జనసేన కీలక భేటీ ముగిసింది. రాష్ట్రంలో మరోసారి కలిసి పొత్తు పెట్టుకొనేందుకు సిద్ధమైన భాజపా - జనసేన నేతలు 2024 వరకు కలిసి నడిచేందుకు అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ భేటీలో ఇరు పార్టీలకు చెందిన అగ్ర నేతలు పాల్గొన్నారు. కాసేపట్లో ఇరు పార్టీలన నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాజధానిని అమరావతి నుంచి మార్చాలని ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాన్ని ఎలా అడ్డుకోవాలి? భూములిచ్చిన రైతులకు ఎలా న్యాయం చేయాలి? రాష్ట్ర ఖజానాపై పడిన భారాన్ని ఎలా తగ్గించాలి? అమరావతిలో రాజధాని కొనసాగించేలా ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తేవాలనే కీలక అంశాలపై నేతలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అలాగే, ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే అంశంపైతో పాటు కేవలం అమరావతి అంశంపైనే కాకుండా 2024వరకు రెండు పార్టీలూ ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి? ఏ అంశాలపై పోరాటాలు చేయాలి? ఏ అంశాలపై ప్రజల్లోకి వెళ్లాలనే అంశాలపై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది.  

జనసేన భాజపాలో విలీనం అవుతుందనే ఊహాగానాలు వస్తోన్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య కేవలం పొత్తులే ఉంటాయనీ.. విలీనానికి అవకాశాల్లేవని నేతలు స్పష్టంచేస్తున్నారు. విలీనం కంటే కలిసి వెళ్లడం వల్లే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. విలీనంతో జనసేన శ్రేణులు ఎంత మేరకు భాజపా వైపు వస్తాయనే అనుమానాలు ఉంటాయి గనక పొత్తు విషయంలోనే ముందుకెళ్లడం మంచిదని ఇరు పార్టీలూ ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. పోరాట అజెండా, భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. అమరావతిలో 30 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం దిగి రాకపోవడంపైనా చర్చించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని