భాజపాతో పొత్తు.. వైకాపాకు వణుకు: నాదెండ్ల

వైకాపా ప్రభుత్వ అప్రజాస్వామిక పరిపాలనను వ్యతిరేకించడానికి భాజపా - జనసేన కలిశాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం....

Updated : 18 Jan 2020 17:13 IST

చిత్తూరు: వైకాపా ప్రభుత్వ అప్రజాస్వామిక పరిపాలనను వ్యతిరేకించడానికి భాజపా - జనసేన కలిశాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు భాజపా, జనసేన నాయకులు స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన, భాజపా పొత్తు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ పార్టీలు జట్టు కట్టడం వల్ల వైకాపా నాయకుల్లో వణుకు పుడుతోందన్నారు. అమరావతి రైతులకు జనసేన-భాజపా మద్దతు ఉంటుందని చెప్పారు. మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని విడదీయాలని చూస్తున్నారని, అది జరిగే పని కాదన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలు అమలయ్యేలా తమ పార్టీ కృషి చేస్తోందని ఆయన తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని