మేం బెళగావి ఎందుకు వెళ్లకూడదు: రౌత్‌

మహారాష్ట్ర శివసేన నాయకుడు సంజయ్‌రౌత్‌ శనివారం కర్ణాటకలోని భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను బెలగావీ పర్యటనకు సిద్ధమవగా ఆంక్షలు విధించడంపై ఆయన మండిపడ్డారు.

Published : 19 Jan 2020 00:29 IST

ముంబయి: మహారాష్ట్ర శివసేన నాయకుడు సంజయ్‌రౌత్‌ శనివారం కర్ణాటకలోని భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను బెళగావి పర్యటనకు సిద్ధమవగా ఆంక్షలు విధించడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ‘అక్రమంగా అనేకమంది భారత్‌లోకి వస్తున్నారు. కానీ మహారాష్ట్ర నుంచి ఒక్క వ్యక్తి కూడా బెళగావి వెళ్లడం లేదు’ అని ఆరోపించారు. ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. బెళగావిలో నిర్వహించిన సంప్రదాయ, సాహిత్య కార్యక్రమంలో అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు నేను వెళ్లాల్సింది.. కానీ ఆ జిల్లాకు వెళ్లడాన్ని నిషేధించారు. అక్కడ వివాదం ఉంది కానీ దానికి ఒకరిపై ఒకరు ఆంక్షలు విధించాల్సినంత అవసరం లేదని అన్నారు. సంజయ్‌రౌత్‌ను ఆ జిల్లాకు పర్యటనకు వెళ్లకుండా నిషేధాజ్ఞలు జారీ చేసిన తర్వాతి రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు