హోం మంత్రి సుచరిత ఇంటి ముట్టడి

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి ఐకాస, విపక్షాలు చలో అసెంబ్లీ నేపథ్యంలో గుంటూరులోని హోం మంత్రి సచరిత ఇంటిని తెదేపా శ్రేణులు ముట్టడించాయి. మంత్రి ఇంటి ఎదుట  మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఆ పార్టీ నేతలు డేగల

Updated : 13 Sep 2023 14:53 IST

అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి ఐకాస, విపక్షాలు చలో అసెంబ్లీ నేపథ్యంలో గుంటూరులోని హోం మంత్రి సచరిత ఇంటిని తెదేపా శ్రేణులు ముట్టడించాయి. మంత్రి ఇంటి ఎదుట  మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఆ పార్టీ నేతలు డేగల ప్రభాకర్‌, నజీర్‌, గోళ్ళ ప్రభాకర్ తదితరులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబును గుంటూరులో పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని