నాకు చెప్పకుండా వెళ్లడం చట్ట వ్యతిరేకం

తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివరణ ఇచ్చేందుకు సోమవారం ప్రభుత్వ కార్యదర్శి గవర్నర్‌ ఆరిఫ్ మహ్మద్‌

Published : 20 Jan 2020 20:41 IST

కేరళ ప్రభుత్వంపై గవర్నర్‌ ఆగ్రహం


తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివరణ ఇచ్చేందుకు సోమవారం ప్రభుత్వ కార్యదర్శి గవర్నర్‌ ఆరిఫ్ మహ్మద్‌ ఖాన్‌ను కలిశారు. తనకు సమాచారం ఇవ్వకుండా సుప్రీంకోర్టుకు వెళ్లడం పట్ల గవర్నర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరి భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘నాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సుప్రీంకోర్టుకు వెళ్లారు. నా అనుమతి తీసుకోవాలని నా అభిప్రాయం. కానీ వాళ్లు అలా చేయలేదు. చట్టపరంగా ఇది సరైనది కాదు. ఇది చట్టవ్యతిరేకం. ఈ విషయంలో వాళ్లు ఎటువంటి వివరణ ఇచ్చినా నేను సంతృప్తి చెందను’ అని గవర్నర్‌ మహ్మద్‌ ఖాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. చీఫ్‌ సెక్రటరీకి తనకు మధ్య జరిగిన సంభాషణను బయట పెట్టడానికి తాను సుముఖంగా లేనని తేల్చి చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లామనే దానికి సంబంధించిన వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ టామ్‌ జోస్‌ సోమవారం గవర్నర్‌ను కలిశారు. సీఏఏను సవాలు చేస్తూ ప్రభుత్వం ఈనెల 13న సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని