మరో వేర్పాటు ఉద్యమం వచ్చుండేది: ధర్మాన

రాజధాని వికేంద్రీకరణ బిల్లును స్వాగతిస్తున్నా అని వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్‌ను అభినందిస్తున్నా అన్నారు. రాజధానుల అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..

Published : 20 Jan 2020 19:43 IST

అమరావతి: రాజధాని వికేంద్రీకరణ బిల్లును స్వాగతిస్తున్నా అని వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్‌ను అభినందిస్తున్నా అన్నారు. రాజధానుల అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి విషయంలో గత ప్రభుత్వం ఎవరి అభిప్రాయమూ తీసుకోలేదన్నారు. ఏకపక్షంగా రాజధానిని నిర్ణయించారని చెప్పారు. అందుకే ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారని ధర్మాన అన్నారు. చంద్రబాబుకు రాజ్యాంగంపై నమ్మకం లేదని విమర్శించారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని, లేదంటే ఏపీలో మరో వేర్పాటు వాద ఉద్యమం వచ్చేదన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయడం ప్రస్తుత ప్రభుత్వం విధి అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని