క్యూలో 50 మంది.. ఆ తర్వాత కేజ్రీవాల్
దిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ వేసేందుకు తిప్పలు పడుతున్నారు. నిన్న ఆయన నిర్వహించిన రోడ్‌షో కారణంగా ఆలస్యం కావడంతో నామినేషన్ వేయలేకపోయారు. దీంతో మంగళవారం వేసేందుకు ఆయన తన తల్లిదండ్రులను వెంట
నామినేషన్ వేసేందుకు దిల్లీ ముఖ్యమంత్రికి తిప్పలు..!
దిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ వేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఆయన నిర్వహించిన రోడ్‌షో కారణంగా ఆలస్యం కావడంతో నామినేషన్ వేయలేకపోయారు. దీంతో మంగళవారం వేసేందుకు ఆయన తన తల్లిదండ్రులను వెంట తీసుకొని వెళ్లారు. మరికాసేపట్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం ముగుస్తుంది. కానీ ఇప్పటి వరకు కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేయలేదు. అందుకు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.
జామ్‌నగర్ హౌస్‌లో నామినేషన్ వేసేందుకు వెళ్లారు. కానీ అక్కడ ఆయన క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. సీఎం కేజ్రీవాల్ ముందు దాదాపు 50 మంది స్వత్రంత అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు క్యూలో ఉన్నారు. దీంతో ఆయన వారి వెనుకే నిలబడాల్సి వచ్చింది. ‘కేజ్రీవాల్‌ను మాకంటే ముందు వెళ్లనీయం’అని లైనులో ఉన్న స్వతంత్ర అభ్యర్థి ఒకరు అన్నారు. ‘సీఎంకు మరో అవకాశం లేదు. ఆయన మాలాగే లైనులో నిలబడాలి’ అని మరో వ్యక్తి అంటున్నాడు. ‘నేను నాతో పాటు మరో 30 మందిని నామినేషన్ వేసేందుకు తీసుకొచ్చాను వాళ్లంతా నామినేషన్ వేసే వరకు సీఎం వేచి ఉండాల్సిందే’అని మరో అభ్యర్థి చెప్పుకొచ్చాడు. అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు నేడే చివరి తేదీ. మధ్యాహ్నం మూడు గంటల్లోపు నామినేషన్ వేయాల్సి ఉంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఫిబ్రవరి 8న ఎన్నిక జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం నేడు
కాంగ్రెస్ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(పీఈసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్‌పై కేసు
ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు బుధవారం చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్‌పై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి: లక్ష్మణ్
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. -
కాళేశ్వరం, కేసీఆర్‌పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 99.8% పోలింగ్
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. -
6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏప్రిల్ 6వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని.. దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. -
రెండో విడత నామినేషన్లకు శ్రీకారం
లోక్‌సభ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఈ విడతలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 సీట్లకు వచ్చే నెల 26వ తేదీన పోలింగ్ జరగనుంది. -
మమతకు మృత్యుఘంటిక మోగుతోంది
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మృత్యుఘంటిక మోగడం మొదలైందని తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్య సరికొత్త దుమారానికి కారణమైంది. -
భాజపా మ్యానిఫెస్టో అంశాలపై చర్చ
భాజపా మ్యానిఫెస్టోలో తెలిపిన అంశాలపై ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చర్చించింది. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమైంది. -
పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీయడానికే బ్యాంకు ఖాతాల స్తంభన
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీయడానికి ఆదాయ పన్ను కట్టలేదనే సాకుతో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్ ఆరోపించారు. -
రూ. 700 కోట్ల ఆస్తి.. ఒక్క వాహనమూ లేదు
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.700 కోట్లుగా ప్రకటించారు. -
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్