Updated : 21 Jan 2020 14:21 IST

మండలి రద్దుచేస్తామంటే భయపడేది లేదు:లోకేశ్‌

అమరావతి: వైకాపా నాయకులు బెదిరించి పాలన సాగించాలని చూస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ఆరోపించారు. మండలి రద్దు కంటే అప్రజాస్వామికం ఏమీ ఉండదన్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూల్‌ 71పై ఎన్నిరోజులైనా చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. మండలి రద్దు చేస్తామంటే భయపడేది లేదన్నారు. ఈ విషయంలో తెదేపా సభ్యులెవరూ ఆందోళనలో లేరని అన్నారు. మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానo మాత్రమే చెయ్యగలదని, తాము కూడా మండలిలో తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 15 మంది మంత్రులు సభకు వచ్చారని, అధికార పార్టీ నేతలే ఇక్కడ ఆందోళన చేస్తున్నారని లోకేశ్‌ దుయ్యబట్టారు.

రద్దుకు ఏడాది పడుతుంది: యనమల
శాసన మండలి రద్దు అంత సులభం కాదని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. కౌన్సిల్ రద్దు చేయాలంటే చాలా ప్రక్రియ ఉందని ఆయన స్పష్టం చేశారు. మండలి రద్దు పార్లమెంట్‌ నిర్ణయం తోనే సాధ్యపడుతుందని, దీనికి కనీసం ఏడాది సమయం పడుతుందని యనమల అన్నారు. మండలి రద్దు జరిగితే వైకాపాలో చీలిక వస్తుందని మరో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అభిప్రాయపడ్డారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని