జైలు నుంచి విడుదలైన గల్లా జయదేవ్‌

అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో అరెస్టయిన తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. మంగళగిరి న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ను విడుదల చేశారు. అనంతరం జైలు వద్ద

Updated : 21 Jan 2020 16:34 IST

మంగళగిరి: అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో అరెస్టయిన తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. మంగళగిరి న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ను విడుదల చేశారు. అనంతరం జైలు వద్ద జయదేవ్‌ మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి పిలుపు మేరకు అసెంబ్లీ వద్దకు వెళ్లి శాంతియుతంగా నిరసన తెలపాలనుకుంటే పోలీసులే తమతో దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. మహిళలు, వృద్ధులపైనా పోలీసులు లాఠీఛార్జి చేశారన్నారు. ఈ క్రమంలో తాను అక్కడే బైఠాయించానని..తనపైకి కూడా పోలీసులు దూకుడుగా వచ్చారని చెప్పారు. అప్పుడు తుళ్లూరు మహిళలు, రైతులు తనను లాఠీఛార్జి నుంచి కాపాడారన్నారు.

సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో ప్రణాళిక ప్రకారం దాడి చేయిస్తున్నారని.. తన పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని జయదేవ్‌ ఆరోపించారు. తన చేతులను వెనక్కి పెట్టడంతో పాటు గోళ్లతో రక్కారన్నారు. ఆ తర్వాత తనను అదుపులోకి తీసుకుని కొన్ని గంటలపాటు పోలీసు వాహనంలో తిప్పారని ఆరోపించారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తే ఇలా వేదిస్తారా? అని ప్రశ్నించారు. ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుని పరిస్థితేంటని జయదేవ్‌ నిలదీశారు. పోలీసులపై రాళ్లదాడి అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని