దమ్ముంటే అమిత్‌ షా నాతో మాట్లాడాలి: ఓవైసీ

కేంద్రం తెచ్చిన సీఏఏపై రాహుల్ గాంధీ, మమతా బెనర్జీతో కాదు.. దమ్ముంటే అమిత్ షా తనతో మాట్లాడాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సవాల్‌ విసిరారు. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా నగరంలోని అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఎంఐఎం ప్రచార సభలో అసదుద్దీన్‌ మాట్లాడారు.

Updated : 22 Jan 2020 10:50 IST

కరీంనగర్‌: కేంద్రం తెచ్చిన సీఏఏపై రాహుల్ గాంధీ, మమతా బెనర్జీతో కాదు.. దమ్ముంటే అమిత్ షా తనతో మాట్లాడాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సవాల్‌ విసిరారు. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా నగరంలోని అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఎంఐఎం ప్రచార సభలో అసదుద్దీన్‌ మాట్లాడారు. తాను తియ్యటి హల్వాలాంటి వాణ్ని కాదని.. ఎర్రటి కారం మిర్చిలాంటివాన్నని చెప్పుకొచ్చారు. గత నెల రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ గురించి అవగాహన కల్పిస్తున్నానన్నారు. ముస్లింలు ఆపదలో ఉన్నపుడు ఏ లౌకిక పార్టీ పరామర్శించేందుకు రాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. సీఏఏ, ఎన్‌పీఆర్‌కు ఈ ఎన్నికలు రెఫరెండం అని పేర్కొన్నారు. కొంతమంది ప్రతి రోజు తన పేరుతో చర్చాకార్యక్రమాలు నిర్వహిస్తూ టీఆర్పీలు పెంచుకుంటున్నాయన్నారు. అందుకు తనకేమీ ఇబ్బంది లేదన్నారు. కరీంనగర్‌లో పోటీ చేస్తున్న 10 మంది కార్పొరేటర్లు గెలిస్తేనే ఇక్కడ ఎంఐఎం బలమైన శక్తిగా ఎదుగుతుందని ఓవైసీ అన్నారు. మజ్లిస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున మైనార్టీలు, ఎంఐఎం కార్యకర్తలు వచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని