మేం ముందే నోటీసులు ఇచ్చాం: యనమల

శాసన మండలిలో నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని తాము ముందుగానే నోటీసులు ఇచ్చామని చెప్పారు. మండలి వాయిదా సమయంలో మీడియాతో...

Published : 22 Jan 2020 20:03 IST

అమరావతి: శాసన మండలిలో నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని తాము ముందుగానే నోటీసులు ఇచ్చామని చెప్పారు. మండలి వాయిదా సమయంలో మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. వైకాపా నుంచి తాము నిబంధనల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎస్సీ,  ఎస్టీ కమిషన్ల ఏర్పాటు విషయంలో ముందు నాన్‌ ఫైనాన్స్‌ బిల్లుగా పెట్టి.. ఆ తర్వాత ఏ నిబంధన ప్రకారం ఫైనాన్స్‌ బిల్లుగా మార్చారని ప్రశ్నించారు. మండలిలో తమకు సంఖ్యాబలం ఉందని.. తాము అడిగితే సెలెక్ట్‌ కమిటీ పంపాల్సిందేనన్నారు. అవసరమైతే ఈ అంశంపై ఓటింగ్‌ నిర్వహించుకోవచ్చని చెప్పారు. ఈ విషయంలో మండలి ఛైర్మన్‌కు పూర్తి అధికారాలు ఉన్నాయన్నారు. సభలో మెజార్టీ సభ్యులు ఏం కోరుకుంటే ఛైర్మన్‌ అది చేస్తారని చెప్పారు. ఓటింగ్‌ సమయంలో సభ్యులు కాని మంత్రులను బయటకు పంపాల్సిందేనని యనమల డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని