బిగ్‌ బ్రేకింగ్‌.. సెలెక్ట్‌ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు!

ఏపీ శాసన మండలిలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను ఛైర్మన్‌ షరీఫ్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపారు..

Updated : 22 Jan 2020 22:14 IST

అమరావతి: ఏపీ శాసన మండలిలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించారు. తనకున్న విచక్షణాధికారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సెలెక్ట్‌ కమిటీకి పంపడంతో మూడు నెలలపాటు ఈ బిల్లులు పెండింగ్‌లో ఉండే అవకాశముంది. మరోవైపు శాసన మండలి ఛైర్మన్‌ నిర్ణయంపై తెదేపా సభ్యులు హర్షం వ్యక్తం చేయగా.. వైకాపా సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని