విద్యాచట్టం సవరణ బిల్లుకు ఆమోదం

ఏపీ విద్యా చట్టం సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. మండలిలో ప్రతిపాదించిన సవరణలు శాసనసభలో వీగిపోయాయి. అంతకు...

Updated : 23 Jan 2020 13:32 IST

అమరావతి: ఏపీ విద్యా చట్టం సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. మండలిలో ప్రతిపాదించిన సవరణలు శాసనసభలో వీగిపోయాయి. అంతకు ముందు ఇంగ్లిష్‌ మీడియంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పోటీ ప్రపంచంలో పేదవారు కూడా నెగ్గాలంటే ఇంగ్లిష్‌ మీడియం అవసరం. పేద విద్యార్థుల కోసమే రైట్‌ టు ఇంగ్లిష్‌ విధానం తీసుకొచ్చాం. విద్యా కానుక పథకం కింద రూ.1350ల విలువైన కిట్‌ను విద్యార్థులకు అందిస్తాం. జూన్‌ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఇంగ్లీష్‌ మీడియం బిల్లును కౌన్సిల్‌లో అడ్డుకున్నారు. పేదవారికి మేలు చేసే బిల్లును ఎందుకు అడ్డుకుంటున్నారో అర్ధం కావడం లేదు. సవరణలు చేస్తూ అసెంబ్లీకి తిప్పి పంపారు. మళ్లీ ఇక్కడ ఆ బిల్లును ఆమోదిస్తున్నాం. ఇప్పుడు మళ్లీ మండలికి పంపుతాం. అసెంబ్లీలో ఆమోదం పొందితే మండలిలో అడ్డుకోవడానికి ఏమీ ఉండదు’’ అని సీఎం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని