మండలిలో షరీఫ్‌ ప్రకటన..వీడియో చూడండి! 

ఏపీ శాసన మండలిలో బుధవారం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను

Updated : 23 Jan 2020 15:34 IST

అమరావతి: ఏపీ శాసన మండలిలో బుధవారం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడంతో సభలో ఏం జరుగుతోందనే దానిపై రోజంతా ఉత్కంఠ కొనసాగింది. అయితే తాజాగా ఛైర్మన్‌ షరీఫ్‌ చేసిన ప్రకటన వీడియో బయటకు వచ్చింది. నిబంధన 154 ప్రకారం తన విచక్షణాధికారం మేరకు రెండు బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

బుధవారం ఉదయం నుంచీ సభలో అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా మధ్య అనేకసార్లు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సభను ఛైర్మన్‌ పలుమార్లు వాయిదా వేశారు. చివరికి రాత్రి 9 గంటల సమయంలో తీవ్ర ఉత్కంఠ నడుమ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించారు. దీనిపై సభలోనే వైకాపా సభ్యులు, మంత్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బిల్లులకు ఆమోదం తెలపడమో తిరస్కరించడమో చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్‌ కమిటీకి పంపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఛైర్మన్‌ నిర్ణయం పట్ల తెదేపా శ్రేణులతో పాటు రాజధాని రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఎన్ని వ్యూహాలు పన్నినా మండలిలో పట్టు నిలబెట్టుకున్నామన్న ఆనందంతో తెదేపా ఎమ్మెల్సీలు సంబరాల్లో మునిగిపోయారు. 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని