‘జగన్‌ కేసులతో రాష్ట్రంపై రూ.30కోట్ల భారం’

సీబీఐ, ఈడీ కేసులు పర్యవేక్షించుకునేందుకే ఇవాళ అసెంబ్లీకి సెలవు ప్రకటించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో....

Updated : 24 Jan 2020 13:01 IST

మాజీ మంత్రి దేవినేని ఉమా 


 

మంగళగిరి: సీబీఐ, ఈడీ కేసులు పర్యవేక్షించుకునేందుకే ఇవాళ అసెంబ్లీకి సెలవు ప్రకటించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమా మాట్లాడుతూ...రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. 

‘‘సీఎం జగన్‌ తన సొంత అజెండా అమలు చేస్తున్నారు. సీఎం ఎంత ప్రయత్నించినా మండలి రద్దు కాదు. మండలి విషయంలో సీఎం తప్పుడు నిర్ణయం తీసుకుంటే కోర్టుకెళ్తాం. ఏ2 ముద్దాయి విజయ సాయిరెడ్డికి మండలిలో ఏం పని? విజయ సాయిరెడ్డి బెయిల్‌  రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయిస్తాం. ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. మండలి ఛైర్మన్‌పై దాడికి యత్నించారు. తప్పు చేస్తున్నందునే మండలి ప్రసారాల లైవ్‌ నిలిపివేశారు. రాజధాని రైతులను అమానుషంగా హింసిస్తున్నారు. మీడియాపై ఆంక్షలా? ప్రశ్నిస్తే కేసులా?అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో సీఎం జగన్‌ కోర్టుకు హాజరు కావడం వల్ల ప్రభుత్వంపై  ఏడాదికి రూ.30కోట్ల వరకు భారం పడుతుంది. అవినీతి సీఎం వల్ల రాష్ట్ర ప్రజలు ఆ భారం భరించాలా?’’ అని ఉమా ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని