మండలిపై ప్రభుత్వానిది అనవసర రాద్ధాంతం

శాసనమండలిపై ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందని మండలి డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదైనా బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపితే ఆ బిల్లును...

Updated : 24 Jan 2020 18:22 IST

ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం

కొత్తపేట: శాసనమండలిపై ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందని ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదైనా బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపితే ఆ బిల్లును వ్యతిరేకించినట్లుగానీ.. ఆమోదించినట్లుగానీ కాదన్నారు. కేవలం ప్రజాభిప్రాయం కోసమే బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపారని పేర్కొన్నారు. సెలెక్ట్‌ కమిటీ ఏం చెబుతుందో ప్రభుత్వం వేచి చూడాలని సుబ్రమణ్యం చెప్పారు. వ్యక్తిగత కక్షతో మండలిని రద్దు చేస్తామని ప్రభుత్వం అనడం భావ్యం కాదన్నారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పిన సీఎం జగన్‌.. ఈరోజు తన తండ్రి తీసుకొచ్చిన మండలి వ్యవస్థను రద్దు చేస్తాననడంపై మరోసారి ఆలోచించాలని రెడ్డి సుబ్రమణ్యం అన్నారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని