ముగిసిన కేటీఆర్‌ దావోస్‌ పర్యటన

దావోస్‌లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటన ముగిసింది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం 4 రోజులపాటు దావోస్‌లో కేటీఆర్‌ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా...

Updated : 24 Jan 2020 17:35 IST

హైదరాబాద్‌: దావోస్‌లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటన ముగిసింది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం 4 రోజులపాటు దావోస్‌లో కేటీఆర్‌ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీల అధిపతులు, వివిధ దేశాల ప్రతినిధులతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. గత నాలుగు రోజులుగా దావోస్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్‌ సుమారు 50కి పైగా సమావేశాలతో పాటు ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన ఐదు చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత నాలుగు రోజులుగా గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, కోకాకోల సీఈవో జేమ్స్ క్వేన్సీ, సేల్స్ ఫోర్స్ వ్యస్థాపకుడు, ఛైర్మన్‌ మార్క్ బెనియాఫ్, యూట్యూబ్ సీఈవో సుసాన్ వొజ్కికి లాంటి కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర విధానాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి కేటీఆర్‌ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని