మండలి రద్దుపై కేబినెట్‌లో తీర్మానం..?

శాసన మండలిని రద్దు చేసే దిశగా ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం 9.30 గంటలకు కేబినెట్‌ భేటీ నిర్వహించాలని...

Published : 24 Jan 2020 18:11 IST

అమరావతి: శాసన మండలిని రద్దు చేసే దిశగా ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం 9.30 గంటలకు కేబినెట్‌ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భేటీలో శాసన మండలి రద్దుపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. అనంతరం 11 గంటలకు శాసనసభ సమావేశం కానుంది. 

సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో శాసన మండలి రద్దుపై తీర్మానం చేసి దాన్ని ఆమోదించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అనంతరం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చించిన తర్వాత ఆమోదం తెలిపే వీలుంది. సభలో ఆమోదం పొందిన తర్వాత బిల్లును పార్లమెంట్‌ ఆమోదం కోసం పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని