నేనెవరికీ అనుకూలం కాదు: బాబా రాందేవ్‌

పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా దిల్లీలోని షాహీన్‌ బాగ్‌లో ఆందోళన చేస్తున్న వారిని శనివారం పరామర్శిస్తానని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ వెల్లడించారు. దిల్లీలో ఆయన ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ.. వందలాది మంది ఆందోళనకారులు ఎండకు ఎండుతూ.. చలికి వణుకుతూ...

Published : 24 Jan 2020 22:14 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా దిల్లీలోని షాహీన్‌ బాగ్‌లో ఆందోళన చేస్తున్న వారిని శనివారం పరామర్శిస్తానని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ వెల్లడించారు. దిల్లీలో ఆయన ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ.. వందలాది మంది ఆందోళనకారులు ఎండకు ఎండుతూ.. చలికి వణుకుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తాను హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలనుకోవడం లేదని.. కేవలం వారి ఆందోళనలకు సంఘీభావం తెలిపేందుకే వెళ్తున్నానని రాందేవ్‌ బాబా పేర్కొన్నారు. అన్యాయం జరిగినట్లు భావిస్తే నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. అయితే అది రాజ్యాంగ బద్ధంగా ఉండాలని రాందేవ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘నేను ఎవరికీ అనుకూలం కాదు. అలాగని వ్యతిరేకమూ కాదు. హిందూ, ముస్లింలు కొట్లాడుకోవాలని నేను కోరుకోవడం లేదు. ఒక వేళ ముస్లిం సోదరులకు అన్యాయం జరిగితే వారి తరఫున నేనుంటా. రేపే షాహీన్ బాగ్‌ వెళ్తున్నా’’ అని రాందేవ్‌ అన్నారు. సీఏఏ వల్ల భారత్‌లోని ముస్లింలు ఇబ్బందులు పడతారన్నది అవాస్తవమని ఈ సందర్భంగా రాందేవ్‌ బాబా చెప్పారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం పోరాడే వారికి ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని అన్నారు. భారత్‌లో పుట్టినప్పటికీ చాలా మంది దగ్గర తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే పత్రాలు లేవని.. నిజానికి తాను కూడా ఎప్పుడు పుట్టానో తెలియదని అన్నారు. తన లాంటి వాళ్లు దేశంలో చాలా మంది ఉన్నారని రాందేవ్‌ వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు