మండలి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు: అంబటి

వైఎస్సార్‌ విధానాలు పాటిస్తామన్నంత మాత్రాన ఆయన మాదిరిగా శాసనమండలిని కొనసాగించాల్సిన అవసరం లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. విచక్షణ మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శాసనమండలి రద్దు చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో...

Updated : 25 Jan 2020 19:58 IST

అమరావతి: వైఎస్సార్‌ విధానాలు పాటిస్తామన్నంత మాత్రాన ఆయన మాదిరిగా శాసనమండలిని కొనసాగించాల్సిన అవసరం లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. విచక్షణ మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శాసనమండలి రద్దు చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలి రద్దుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. శాసనమండలి ఉండొచ్చు.. ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు.

గతంలో వైఎస్సార్‌ మండలిని పునరుద్ధరిస్తే.. ఇప్పుడు ఆయన తనయుడు రద్దు చేస్తున్నారన్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. ఒక జాతీయ పార్టీకి వైఎస్సార్‌ సీఎంగా పనిచేశారని గుర్తుచేశారు. ఆ పార్టీ విధానాలకు అనుగుణంగా నడుచుకుని ఉండొచ్చన్నారు. వైఎస్సార్‌లా మండలి సాగించాల్సిన అవసరం లేదన్నారు. ఆయన పథకాలను, విధానాలను మాత్రం కొనసాగిస్తామన్నారు. రాజధాని మార్పు అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదే ఉద్ఘాటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని అంబటి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని