‘నా సతీమణి ఛైర్‌పర్సన్‌ కాకపోవడమే మంచిదైంది’

ఎన్నికల్లో డబ్బు ప్రభావం స్పష్టంగా కనిపించిందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో...

Updated : 26 Jan 2020 17:24 IST

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో డబ్బు ప్రభావం స్పష్టంగా కనిపించిందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్బులతో ఎన్నికలను గెలవచ్చనే కొత్త తరహా విధానాన్ని తెరాస తీసుకొచ్చిందని జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వద్ద డబ్బు లేదని.. ప్రజల ఆదరాభిమానాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. సంగారెడ్డిలో రెండు మున్సిపాలిటీలు గెలిచిన ఆర్థిక మంత్రి హరీష్‌రావును అభినందిస్తున్నట్లు చెప్పారు. తన భార్య మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కాకపోవడమే మంచిదైందని.. ఓటర్లు తనమీద ఎలాంటి ఒత్తిడి లేకుండా చేశారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు ఉమ్మడి మెదక్‌ జిల్లాకు సింగూరు నీళ్లు తీసుకొచ్చే బాధ్యతను ప్రజలు మంత్రి హరీష్‌రావుకు అప్పగించారని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని