సెలెక్ట్‌ కమిటీకి పేర్లు ఇవ్వండి: షరీఫ్‌ లేఖ

సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటులో తొలి అడుగు పడింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి సిఫార్సు చేస్తూ ఇటీవల శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Published : 27 Jan 2020 01:51 IST

అమరావతి: సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటులో తొలి అడుగు పడింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి సిఫార్సు చేస్తూ ఇటీవల శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ బిల్లుపై రెండు కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మండలిలో సభ్యత్వం ఉన్న పార్టీలకు షరీఫ్‌ లేఖ రాశారు. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు పేర్లు ఇవ్వాలని ఆయన కోరారు. సంబంధిత శాఖా మంత్రులే ఛైర్మన్లుగా 9 మందితో ఒక్కో కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కమిటీలో తెదేపా నుంచి 5, వైకాపా, భాజపా, పీడీఎఫ్‌ నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించనున్నారు.

ఇవీ చదవండి..

3 రాజధానులకు ఎదురుదెబ్బ

షరీఫ్‌పై బొత్స ఆగ్రహం!

సర్కారుకు షాక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని