
ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి భవితవ్యం తేల్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయం బ్లాక్ 1లో మంత్రివర్గం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒక వేళ మండలిని రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయిస్తే.. వెంటనే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశముంది. అనంతరం తీర్మానం ప్రతిని కేంద్రానికి పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాజ్యాంగ అధికరణ 169(1) ప్రకారం రద్దు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది.
మరోవైపు శాసనమండలిలోని ఇద్దరి మంత్రుల భవితవ్యంపై ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు ఆలోచించినట్లు సమాచారం. వారిద్దరినీ రాజ్యసభ సభ్యులుగా పంపాలని వైకాపా నిర్ణయంగా తెలుస్తోంది. మరోవైపు మండలి రద్దుపై న్యాయపరమైన చిక్కులపైనా సీఎం జగన్ సమీక్ష చేసినట్లు సమాచారం. ఈ అంశాలన్నింటినీ చర్చించి రాష్ట్ర మంత్రి వర్గం ఓ నిర్ణయానికి రానుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.