
Updated : 27 Jan 2020 10:29 IST
మండలి రద్దు అవసరం ఏముంది:యనమల
అమరావతి: శాసనమండలి రద్దు చేయడం ప్రజావేదిక కూల్చినంత తేలిక కాదని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. 2021కల్లా శాసనమండలిలో వైకాపాకు మెజార్టీ వస్తుందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. అలాంటప్పడు రద్దు అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒకవేళ రద్దుకు ప్రతిపాదించినా.. దానిని అమలు చేసేందుకు రెండు మూడేళ్లు పడుతుందని, అప్పటి వరకు శాసనమండలి కొనసాగుతూనే ఉంటుందని యనమల చెప్పారు. ఒక నిర్మాణాత్మక పంథాలో ఏర్పడిన సభగా మండలిని యనమల అభివర్ణించారు. రాజ్యాంగ వ్యవస్థల రద్దు అనుకున్నంత సులభం కాదన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరించినా లొంగకుండా తెదేపా ఎమ్మెల్సీలంతా దృఢంగా ఉన్నారని యనమల కొనియాడారు.
Tags :