
తెలంగాణలో ఉత్కంఠగా ఛైర్మన్ల ఎన్నిక
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఛైర్మన్ల ఎన్నిక కొనసాగుతోంది. పలుచోట్ల ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు కీలకం కావడంతో ఛైర్మన్ల ఎన్నిక ఉత్కంఠగా సాగుతోంది. వివిధ చోట్ల ఛైర్మన్ ఎన్నికల సరళిని పరిశీలిస్తే..
* రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి అధికార తెరాస షాక్ ఇచ్చింది. ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు తెరాస ప్రయత్నం ఇక్కడ సఫలమైంది. 14వ వార్డు నుంచి గెలిచిన కాంగ్రెస్ సభ్యురాలు కొత్త హారిక తెరాసలో చేరింది. ఇక్కడ ఛైర్మన్ పదవికి కావాల్సిన ఎనిమిది మంది సభ్యులు ఉండటంతో తెరాస ధీమాగా ఉంది. మరికాసేపట్లో ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.
* నేరేడుచర్లలో రాజ్యసభ సభ్యుడు కేవీపీకి ఎక్స్అఫిషియో ఓటు హక్కు కల్పించారు. కేవీపీ ఓటు రద్దు చేస్తూ నేరేడుచర్ల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఓటు వేసేందుకు కేవీపీకి అనుమతిచ్చింది. మరోవైపు సాయంత్రం 4 గంటలకు మున్సిపాలిటీకి ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు గెలుపొందిన వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు.
* పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ ఛైర్మన్ పదవి కాంగ్రెస్ నుంచి చేజారింది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన కౌన్సిలర్లు తెరాసలో చేరారు. ఇక్కడ ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, నవీన్‌కుమార్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు వేయనున్నారు.
* భూత్పూర్లో భాజపా ఛైర్మన్ అభ్యర్థిగా కృష్ణవేణిని పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. నలుగురు భాజపా సభ్యులకు జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి విప్ జారీ చేశారు.
* తుక్కుగూడ మున్సిపాలిటీలో భాజపాకు షాక్ ఇచ్చేందుకు తెరాస సిద్ధమైంది. తుక్కుగూడ మున్సిపల్ కార్యాలయానికి ఐదుగురు తెరాస సభ్యులు చేరుకున్నారు. ఇక్కడ ఓ స్వతంత్ర అభ్యర్థి తెరాసకు మద్దతు తెలిపారు. వీరితోపాటు ఐదుగురు తెరాస ఎక్స్అఫిషియో సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు 9 మంది భాజపా సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు.
* చౌటుప్పల్ పురపాలిక కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పురపాలక సంఘం కార్యాలయం ముందు ఎమ్మెల్యే కోమటిరెడ్డితోపాటు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో కోమటిరెడ్డిని అదుపులోకి తీసుకొని వాహనంలో తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా.. కార్యకర్తలు అడ్డుకున్నారు.
* నల్గొండ జిల్లా చిట్యాల పురపాలిక ఛైర్మన్‌గా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వైస్ ఛైర్మన్ గా కూరెళ్ల లింగస్వామి ఎన్నికయ్యారు.
* నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఛైర్మన్‌గా తూము పద్మ ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది.
* నిజామాబాద్ నగర మేయర్‌గా నితు కిరణ్ ఎన్నికయ్యారు. ఉదయం కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్ ఎన్నిక జరిగింది. తెరాసకు 38 మంది సభ్యుల బలం ఉండటంతో ఆ పార్టీకి చెందిన నితు కిరణ్‌ను మేయర్‌గా ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్‌గా ఎంఐఎంకు చెందిన ఇద్రిశ్ ఖాన్ ఎన్నికయ్యారు.
* కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌గా కుడుముల సత్యం ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలోని 12 స్థానాల్లో అధికార తెరాస 9 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. సోమవారం నిర్వహించిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ఏడో వార్డుకు చెందిన కుడుముల సత్యం ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా ఐదో వార్డుకు చెందిన ఎం. సుజాత ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జె. సురేందర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి అభివృద్ధి, ఎల్లారెడ్డిని నందనవనంగా మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. తెరాస నాయకలు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
* ఆదిలాబాద్ పురపాలక ఛైర్మన్‌గా..జోగు ప్రేమేందర్, వైస్ ఛైర్మన్‌గా జహీర్ రంజాని ఎన్నికయ్యారు.
* కాగజ్‌నగర్ మున్సిపల్ ఛైర్మగా మహమ్మద్ సద్దాం, వైస్ ఛైర్మన్‌గా రాచకొండ గిరీష్ ఎన్నికయ్యారు.
* క్యాతనపెల్లి మున్సిపల్ ఛైర్మన్ జంగం కళ, వైస్ ఛైర్మన్‌గా సాగర్ రెడ్డి ఎన్నికయ్యారు.
*చెన్నూర్ మున్సిపల్ చైర్మగా అర్చన గిల్డా, వైస్ ఛైర్మన్‌గా నవాజోద్దీన్ ఎన్నికయ్యారు.
*మంచిర్యాల మున్సిపల్ ఛైర్మన్‌గా పెంట రాజయ్య, వైస్ ఛైర్మన్‌గా ముకేశ్ గౌడ్ ఎన్నికయ్యారు.
*లక్షెట్టిపేట మున్సిపల్ ఛైర్మన్‌గా నలమాసు కాంతయ్య, , వైస్ ఛైర్మన్‌గా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు.
*నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్‌గా గండ్రత్ ఈశ్వర్, వైస్ ఛైర్మన్‌గా సయ్యద్ సాజిద్ ఎన్నికయ్యారు.
*నస్పూర్ మున్సిపల్ ఛైర్మన్‌గా ఈసంపల్లి ప్రభాకర్, వైస్ ఛైర్మన్‌గా తొంటి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
*ఖానాపూర్ చైర్మన్‌గా రాజేందర్, వైస్ ఛైర్మన్‌గా అబ్దుల్ ఖలీల్ ఎన్నికయ్యారు.
*భైంసా చైర్మన్‌గా సాబియా బేగం, వైస్ ఛైర్మన్‌గా జాబీర్ అహ్మద్ ఎన్నికయ్యారు.
*రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్‌గా జిందం కళ, వైస్ చైర్మన్‌గా మంచే శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
* ఖమ్మం జిల్లా ఇల్లెందు మున్సిపల్ ఛైర్మన్‌గా దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ ఛైర్మన్‌గా జానీ ఎన్నికయ్యారు.
* కొత్తగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కాపు సీతాలక్ష్మి, వైస్ ఛైర్మన్‌గా వేల్పుల దామోదర్ ఎన్నిక
* వైరా మున్సిపల్ ఛైర్మన్‌గా సుతగాని జైపాల్, వైస్ ఛైర్మన్‌గా ముళ్లపాటి సీతారాములు ఎన్నిక
* మధిర మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా మొండితోక లలిత, వైస్ ఛైర్‌పర్సన్‌గా వై.విద్యాలత ఎన్నికయ్యారు.
* సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా కూసుంపూడి మహేశ్, వైస్ ఛైర్మన్‌గా సుజలరాణి ఎన్నిక
* జనగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పోకల జమున, వైస్ ఛైర్మన్‌గా మేకల రాంప్రసాద్ ఎన్నిక
* తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్‌గా ఎం. రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్‌గా జి.సురేందర్‌రెడ్డి ఎన్నిక
* మహబూబాబాద్ మున్సిపల్ ఛైర్మన్‌గా పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా ఫరీద్ ఎన్నిక
* వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా అంగోతు అరుణ, వ ఐస్ ఛైర్మన్‌గా ఏలేందర్రెడ్డి ఎన్నిక
* భూపాలపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా సెగ్గం వెంకటరాణి, వైస్ ఛైర్మన్‌గా కొత్త హరిబాబు ఎన్నిక
* పరకాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా సోద అనిత, వైస్ ఛైర్మన్‌గా జైపాల్‌రెడ్డి ఎన్నిక
* నర్సంపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గుంటి రజనీ, వైస్ ఛైర్మన్‌గా మునగాల వెంకట్‌రెడ్డి ఎన్నిక
* మరిపెడ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గగులోతు సింధూర, వైస్ ఛైర్మన్‌గా బుచ్చిరెడ్డి ఎన్నిక
* డోర్నకల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా వాంకుడోతు వీరన్న, వైస్‌ఛైర్మన్‌గా కె.కోటిలింగం ఎన్నిక