భయపెట్టి లాక్కోవటం మంచి పద్ధతా?: అచ్చెన్న

ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ఆదుర్దాగా మండలి రద్దు బిల్లును సభలో పెట్టారని తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. శాసనసభ సమావేశాలు అంటే ...

Updated : 27 Jan 2020 14:03 IST

మంగళగిరి: ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ఆదుర్దాగా మండలి రద్దు బిల్లును సభలో పెట్టారని తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. శాసనసభ సమావేశాలు అంటే ఒక విధానంపై అజెండా ఉండేదని చెప్పారు. ప్రస్తుతం దానిని పక్కనపెట్టారని విమర్శించారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నందునే పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపామన్నారు. 

మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా చెప్పకుండా అప్పటికప్పుడు ఫోన్‌ చేసి బీఏసీ సమావేశం ఉందని చెప్పారన్నారు.‘‘ఇప్పటి వరకు 32 బిల్లులను మండలికి పంపించారు. వాటిని మేం వ్యతిరేకించలేదు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నందునే పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాం’’ అని అచ్చెన్న అన్నారు. కేవలం ఆరు రాష్ట్రాల్లోనే మండళ్లు ఉన్నాయని వితండవాదం చేస్తున్నారని, అలాంటప్పుడు దేశంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా?’’ అని అచ్చెన్న విమర్శించారు. కేసులు పెడతామని భయపెట్టి ఎమ్మెల్సీలను పార్టీలోకి లాక్కోవడం మంచి పద్ధతా? అని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని