సీఏఏకు మద్దతివ్వను..నా ఇంటిని విడదీస్తుంది

ముంబయి: పౌరచట్టం, ఎన్నార్సీకి తాను ఎంతమాత్రం మద్దతివ్వబోనని బాలీవుడ్‌ నటి పూజా భట్‌ తెలిపారు. సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నిజానికి ఈ చట్టం ద్వారా ప్రభుత్వం మనల్ని అందరినీ ఏకం చేస్తూ ఒకేతాటిపైకి తీసుకొచ్చిందని

Published : 29 Jan 2020 00:33 IST

ముంబయి: పౌరచట్టం, ఎన్నార్సీకి తాను ఎంతమాత్రం మద్దతివ్వబోనని బాలీవుడ్‌ నటి పూజా భట్‌ తెలిపారు. సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 

‘మన మౌనం మనల్ని ఎప్పుడూ కాపాడదు. అధికార పార్టీ మనలాంటి నిరసనకారులందరినీ కలిపింది. మనం గొంతెత్తాల్సిన సమయం ఆసన్నమైందనే విషయాన్ని విద్యార్థులు తమ నిరసన ద్వారా తెలియజేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చేంత వరకూ పోరాటాన్ని ఆపకూడదు. ప్రజల గొంతుకను నేతలు వినాలి. సీఏఏ, ఎన్నార్సీకి ఎంతమాత్రం మద్దతివ్వను, అది నా ఇంటిని విడదీస్తుంది’ అని ఆమె అన్నారు.

సీఏఏ పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలను వెల్లువెత్తుతున్నాయి. దీన్ని అమలు చేయబోమని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపాయి. సీఏఏను సవాలు చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని