
కేంద్రానికి ఏపీ మండలి రద్దు తీర్మానం
అమరావతి: ఏపీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. నిన్నరాత్రి అసెంబ్లీలో చేసిన తీర్మాన ప్రతితోపాటు ఓటింగ్‌కు సంబంధించిన వివరాలను, బిల్లులకు సంబంధించిన అంశాలను శాసనసభ సచివాలయం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అక్కడి నుంచి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి, హోం, న్యాయ శాఖలకు పంపింది. దీనిపై కేంద్ర మంత్రి వర్గంలో తీర్మానం చేసిన అనంతరం రాజ్యాంగ అధికరణ 169(1) ప్రకారం మండలి రద్దుకు పార్లమెంట్‌లో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.