మహిళల పేర్ల మీదే ఇళ్ల పట్టాలు:జగన్‌

ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాలను మహిళల పేర్లు మీదే రిజిస్ట్రేషన్‌ చేయించాలన్నారు. సచివాలయంలో స్పందన కార్యక్రమంపై...

Published : 28 Jan 2020 21:31 IST

అమరావతి: ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాలను మహిళల పేర్లు మీదే రిజిస్ట్రేషన్‌ చేయించాలన్నారు. సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల అమలుపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. వచ్చేనెల 15 నుంచి కొత్త పింఛను, బియ్యం కార్డులు పంపిణీ చేయాలని జగన్‌ ఆదేశించారు. తొలి విడత జగనన్న విద్యా వసతి దీవెన పథకాన్ని వచ్చే నెల 20 నుంచి, రెండో విడతను జులై-ఆగస్టులో ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు.

కంటి వెలుగు మూడో విడతను ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఫిబ్రవరి 20న 3,300 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించి.. ఆ సంఖ్యను ఏప్రిల్‌ చివరినాటికి 11వేలకు పెంచాలని జగన్‌ అధికారులకు సూచించారు. దిశ పోలీస్‌స్టేషన్ల నిర్మాణంపైనా సీఎం ఆరా తీశారు. ఫిబ్రవరి మొదటివారం నాటికి 2 చోట్ల దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై అధికారులు సమాధానమిస్తూ విజయనగరం, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు సీఎంకు వివరించారు. అన్ని జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం నాటికి 60 లక్షల నుంచి 70లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉంచాలని జగన్‌ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని