గాంధీ మాటే నాకు ఆదర్శం: చంద్రబాబు

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఈ రోజును అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నామని ట్విటర్‌ వేదికగా తెలిపారు. దేశ ప్రజల

Updated : 30 Jan 2020 11:53 IST

అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఈ రోజును అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నామని ట్విటర్‌ వేదికగా తెలిపారు. దేశ ప్రజల సంక్షేమానికి, సమైక్యతకు, శాంతియుత జీవనం కోసం కృషి చేస్తూ ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ చంద్రబాబు గౌరవవందనం సమర్పించారు. ‘మన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వహించడమే దేశసేవ’ అనే గాంధీ సూక్తి తనకు ఆదర్శమని చంద్రబాబు అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టటమే కాకుండా, మనిషిని మహాపురుషునిగా చేసే సద్గుణాలను సూచించిన మార్గదర్శకుడు గాంధీజీ అని కొనియాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు