ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. గురువారం నియోజకవర్గ పర్యటనలో భాగంగా బాలకృష్ణ హిందూపురం వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు వైకాపా శ్రేణులు అక్కడికి

Updated : 30 Jan 2020 14:38 IST

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. గురువారం నియోజకవర్గ పర్యటనలో భాగంగా బాలకృష్ణ హిందూపురం వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు వైకాపా శ్రేణులు అక్కడికి చేరుకొని ‘బాలయ్య గో బ్యాక్‌’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బాలకృష్ణ వాహనానికి రహమత్‌ సర్కిల్‌ వద్ద వైకాపా శ్రేణులు అడ్డురావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని వైకాపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ తన పర్యటనను యథావిధిగా కొనసాగించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని