చర్చకు మేం రెడీ: మోదీ

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. గత పార్లమెంట్‌ సమావేశంలో ఆమోదించిన పౌరసత్వ సవరణ........

Updated : 30 Jan 2020 20:18 IST

ముగిసిన అఖిలపక్ష సమావేశం 

దిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. గత పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది. ఈ భేటీ అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. కశ్మీర్‌లో గత కొన్ని నెలలుగా నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లాను తక్షణమే విడుదల చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయని చెప్పారు. సీఏఏ ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి అహంకారపూరితంగా ఉందన్నారు. నిరసనకారులతో చర్చించేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడంలేదన్నారు.  

మరోవైపు, ఈ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను వినేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారన్నారు. ఏ అంశంపైనా చర్చకు సిద్ధమేనన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన దేశం ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించాలన్నారని తెలిపారు.  పార్లమెంట్‌లో ప్రజాస్వాబద్ధంగా ఆమోదం పొందిన సీఏఏ విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.  

ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రహ్లాద్‌ జోషీ, పలువురు సీనియర్‌ మంత్రులతో పాటు కాంగ్రెస్‌ నేతలు ఆనంద్‌ శర్మ, గులాం నబీ ఆజాద్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సుదీప్‌ బందోపాధ్యాయ్‌, తెరాస ఎంపీలు నామా నాగేశ్వరరావు, కేకే, వైకాపా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శనివారం రోజున పార్లమెంట్‌లో బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. 


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని