‘కేసీఆర్ ప్రధాని..కేటీఆర్‌ సీఎం కావాలి’

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పనితీరు వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని...

Updated : 30 Jan 2020 17:34 IST

మంత్రి గంగుల కమలాకర్‌ వ్యాఖ్య

హైదరాబాద్‌: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పనితీరు వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కమలాకర్‌ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పనితీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వచ్చే 40 ఏళ్లపాటు తెలంగాణలో తెరాసే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశమంతా కేసీఆర్‌ ప్రధాని కావాలని కోరుకుంటోందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్‌ ప్రధాని.. రాష్ట్రంలో కేటీఆర్‌ సీఎం కావాలని గంగుల కమలాకర్‌ వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని