ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తాం: వైకాపా

విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని అఖిలపక్ష సమావేశంలో వైకాపా కోరింది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన  నిర్వహించిన అఖిలపక్ష భేటీలో వైకాపా ఎంపీలు...

Updated : 30 Jan 2020 17:49 IST

దిల్లీ: విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని అఖిలపక్ష సమావేశంలో వైకాపా కోరింది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన  నిర్వహించిన అఖిలపక్ష భేటీలో వైకాపా ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం ఆ పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ లోటు, రాజధాని నిర్మాణంతో పాటు పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు ఇవ్వాలని కోరామన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులనూ విడుదల చేయాలని కోరామని తెలిపారు. వైకాపా లోక్‌సభాపక్ష నేత మిధున్‌రెడ్డి మాట్లాడుతూ మైనార్టీల్లో నెలకొన్న ఆందోళన దృష్ట్యా ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీపై చర్చ జరగాలని తాము కోరామన్నారు. ఈ బిల్లులను కచ్చితంగా వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని