సీఎం జగన్‌కు కన్నా లేఖ

అమరావతి నుంచి విశాఖకు పరిపాలన రాజధాని మార్చడం సరైన నిర్ణయం కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పునరుద్ఘటించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. మూడు రాజధానుల నిర్ణయం...

Published : 31 Jan 2020 01:32 IST

గుంటూరు: అమరావతి నుంచి విశాఖకు పరిపాలన రాజధాని మార్చడం సరైన నిర్ణయం కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పునరుద్ఘటించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మాత్రమే భాజపా అనుకూలమని..పరిపాలన వికేంద్రీకరణకు కాదని చెప్పారు. ఇటువంటి అనాలోచిత నిర్ణయాలతో అభివృద్ధి కుంటుపడి తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు. విశాఖను రాజధానిగా చేస్తే ఎదురయ్యే సమస్యలను జీఎన్‌ రావు కమిటీ చెప్పినా పట్టించుకోవటం లేదని కన్నా ఆక్షేపించారు. అమరావతిలోనే శాసన, పరిపాలనా రాజధానులను కొనసాగించాలని భాజపా డిమాండ్‌ చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ప్రజల అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలని ఆయన హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని