లక్ష్మీనారాయణ రాజీనామాపై పవన్‌ స్పందన

పార్టీకి రాజీనామా చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తు్న్నట్లు చెప్పారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.

Published : 31 Jan 2020 01:31 IST

అమరావతి: పార్టీకి రాజీనామా చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. ‘‘నాకు సిమెంట్‌ ఫ్యాక్టరీలు, పవర్‌ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలులాంటివి ఏమీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారికోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణ తెలుసుకుని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. లక్ష్మీనారాయణ రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనకు శుభాభినందనలు’’ అని పవన్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

జనసేన పార్టీకి షాక్‌!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు