సెలక్టు కమిటీల నియామకంపై ప్రతిష్టంభన

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులపై శాసన మండలి సెలక్టు కమిటీల నియామకంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ కమిటీలో తమ పార్టీ తరఫున ఎవరినీ సభ్యులుగా నియమించబోమని

Published : 31 Jan 2020 06:45 IST

ఐదుగురు చొప్పున పేర్లు ఇచ్చిన తెదేపా
పేర్లు ఇచ్చేందుకు వైకాపా విముఖత

ఈనాడు, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులపై శాసన మండలి సెలక్టు కమిటీల నియామకంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ కమిటీలో తమ పార్టీ తరఫున ఎవరినీ సభ్యులుగా నియమించబోమని వైకాపా అంటోంది. తెదేపా ఇప్పటికే రెండు కమిటీలకు ఐదుగురు చొప్పున ఎమ్మెల్సీల పేర్లతో శాసనసభ, మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు లేఖలు అందజేసింది. కార్యదర్శికి లేఖలు అందజేసినట్టు ధ్రువీకరణ కూడా పొందింది. సభ్యుల పేర్లను సూచించాల్సిందిగా శాసన మండలి కార్యదర్శి నుంచి ఇంతవరకు రాజకీయ పార్టీలకు లేఖలు వెళ్లలేదు. మండలి ఛైర్మన్‌ శాసన మండలి కార్యదర్శికి జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. సెలక్టు కమిటీల నియామకానికి సోమవారం వరకు గడువున్నట్టు సమాచారం.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని