ప్రాంతీయ విద్వేషాలకు అడ్డాగా సీమ:కళా

ప్రశాంతంగా ఉన్న రాయలసీమను వైకాపా ప్రభుత్వం ప్రాంతీయ విద్వేషాలకు అడ్డాగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షడు కళావెంకట్రావు మండిపడ్డారు....

Published : 02 Feb 2020 15:01 IST

విజయవాడ: ప్రశాంతంగా ఉన్న రాయలసీమను వైకాపా ప్రభుత్వం ప్రాంతీయ విద్వేషాలకు అడ్డాగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షడు కళావెంకట్రావు మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతిపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడే మాటలకు.. వ్యవహరిస్తున్న తీరుకు ఏమాత్రం పొంతన లేదని విమర్శించారు. అమరావతిపై ప్రజల దృష్టి మరల్చేందుకే రాయలసీమలో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నారావారిపల్లెలో వైకాపా తలపెట్టిన బహిరంగ సభ తెదేపా అధినేత చంద్రబాబుపై కక్షకు నిదర్శనమన్నారు. ప్రతీకారం చుట్టే సీఎం జగన్‌ పరిపాలన సాగుతోందని.. ఇదే చొరవ పాలనపై చూపడం లేదని కళా వెంకట్రావు ఆక్షేపించారు. హైకోర్టు చీవాట్లు పెట్టినప్పటికీ ఆయన  వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు. వైకాపా సభకు అనుమతిచ్చారని.. తెదేపాకు నిరాకరించడం ద్వారా పోలీసులు ద్వంద్వ వైఖరి తెలుస్తోందని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని