సెలక్ట్‌ కమిటీలకు పేర్లు పంపిన పార్టీలు

మూడు రాజధానులు, సీఆర్‌డీఏ బిల్లులను ఏపీ శాసన మండలి ఛైర్మన్‌ సెలక్ట్‌ కమిటీలకు పంపిన నేపథ్యంలో ఆయా కమిటీల్లో ఉండాల్సిన నేతల జాబితాను ...

Updated : 03 Feb 2020 17:20 IST

అమరావతి: మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను ఏపీ శాసన మండలి ఛైర్మన్‌ సెలక్ట్‌ కమిటీలకు పంపిన నేపథ్యంలో ఆయా కమిటీల్లో ఉండాల్సిన నేతల జాబితాను పార్టీలు పంపించాయి. తెదేపా, భాజపా, పీడీఎఫ్‌ నుంచి మండలి ఛైర్మన్‌ కార్యాలయానికి ఈ జాబితాలు చేరాయి. ఒక్కో కమిటీలో తెదేపా నుంచి ఐదుగురు.. భాజపా, పీడీఎఫ్‌ నుంచి ఒక్కొక్కరికి మండలి ఛైర్మన్‌ అవకాశం కల్పించారు. దానికి అనుగుణంగా మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులకు ఆయా పార్టీలు పేర్లను పంపాయి. వైకాపా నుంచి ఇంతవరకు ఎలాంటి జాబితా అందలేదని తెలుస్తోంది.

తెదేపా నుంచి..

మూడు రాజధానుల బిల్లుకు నారా లోకేశ్‌, అశోక్‌బాబు, తిప్పేస్వామి, బీటీ నాయుడు, సంధ్యారాణి.. సీఆర్‌డీఏ బిల్లుకు దీపక్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, బీద రవిచంద్ర, గౌనువారి శ్రీనివాసులు, బుద్ధా వెంకన్న పేర్లను తెదేపా పంపింది.

భాజపా, పీడీఎఫ్‌ తరఫున..

భాజపా నుంచి మూడు రాజధానుల బిల్లుకు మాధవ్‌, సీఆర్‌డీఏ బిల్లుకు సోము వీర్రాజు పేర్లను పంపగా.. పీడీఎఫ్ తరఫున మూడు రాజధానులు బిల్లుకు కె.ఎస్‌.లక్ష్మణరావు, సీఆర్‌డీఏ బిల్లుకు ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) పేర్లను ఆ పార్టీ పంపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని