ప్రధాని మాట నిలబెట్టుకోవాలి: సుచరిత

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు..

Published : 04 Feb 2020 13:32 IST

కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు అవసరమైన నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజధాని రైతులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్ని విధాలా ఆదుకుంటారని మంత్రి హామీ ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాల సంఖ్య 6శాతం తగ్గిందని ఆమె అన్నారు. రాజధాని భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, వీటిపై ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేపట్టిందని చెప్పారు. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్‌ పాలన వికేంద్రీకరణ తీసుకొస్తున్నారని హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని