ఆ వ్యాఖ్యలపై మోదీ, షా స్పందించరేం?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ దేశ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసేలా ఉందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. వ్యవసాయ రంగానికి నామమాత్రపు కేటాయింపులే చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం ఎంబీ భనవ్‌లో

Published : 04 Feb 2020 14:55 IST

బీవీ రాఘవులు ప్రశ్న

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ దేశ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసేలా ఉందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. వ్యవసాయ రంగానికి నామమాత్రపు కేటాయింపులే చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం ఎంబీ భనవ్‌లో ఏర్పాటు చేసిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. తాజా బడ్జెట్‌ కార్పొరేట్‌ శక్తులకు మేలు చేసేలా మాత్రమే ఉందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం తెరాస, వైకాపా ముందుకొచ్చి కేంద్రంపై పోరాడాలని సూచించారు. జాతిపిత మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా ఆ పార్టీ ఎంపీలు పలు సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకమన్న కేసీఆర్‌ వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు.  దిల్లీలో మూడు స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తోందని వెల్లడించారు. భాజపాను ఎవరైతే ఓడిస్తారో వారికే తమ పార్టీ మద్దతిస్తుందని రాఘవులు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని