భాజపా ఎంపీలది అసత్య ప్రచారం:నామా

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేయాలని భాజపా ఎంపీలు ప్రయత్నిస్తున్నారని తెరాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. దిల్లీ విజయ్‌చౌక్‌లో...

Updated : 05 Feb 2020 16:57 IST

దిల్లీ: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేయాలని భాజపా ఎంపీలు ప్రయత్నిస్తున్నారని తెరాస లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆరోపించారు. దిల్లీ విజయ్‌చౌక్‌లో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుతో కలిసి నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాలను అడ్డుకోవాలని చూస్తున్నారని నామా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాల్లో అవినీతి ఉందని చెప్పి పథకాలను ఆపాలని భాజపా ఎంపీలు కోరినట్లు నామా తెలిపారు. పథకాల ద్వారా ఆధార్‌ డేటాను తీసుకుంటున్నామని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాల్లో ఎలాంటి మోసాల్లేవని కేంద్రం సమాధానమిచ్చినట్లు నామా స్పష్టం చేశారు.

అవినీతికి ఆస్కారం లేదు..: కేకే
తెలంగాణ సంక్షేమ పథకాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకే ఆధార్‌ను పెట్టినట్లు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తెలిపారు. సాంకేతికతను వినియోగించి మోసాలకు వీలు లేకుండా చేసినట్లు కేకే పేర్కొన్నారు. నిజామాబాద్‌ సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయితే వరంగల్‌ జిల్లాలో ఉన్న బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్‌కు తరలించొద్దని కోరినట్లు కేకే తెలిపారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని